12, జులై 2020, ఆదివారం

శివా...రుద్రస్య బేషజీ

Image for post

కాల దురితాల నడుమ నలిగి...
ఈతి బాధలు పడుతు చెలగి..
తనవారికి తక్క, పరుల మేలు తలవక
ఇహపరాల తలపు పొసగక
మాయ మాటున ఉబుసు పొక
కాయమున హంస పైకెగరగ

కట్టేతో బాటు కాటికేగి
తోబుట్టువులు సైతం
తోడ రాని పయనం
రుధిర, దేహ బాంధవులైనా
చేష్టలుడిగి చూడగా

తను బతికిన గతమున
సలిపిన గమనమున
మరలిన పలు మలుపుల
కలిగిన తలపుల నెమరి
భ్రాంతి పెరిగి విలవిల లాడి
తనవారి చుట్టు తనకలాడి

కర్మ వాసనలు మూటకట్టి
బొటన వేలంత జీవు డింక
మది నిలబడిన చింతనలబట్టి
ఆ తోలు తిత్తి నుండి
తోచిన బొఱ్ఱ నుండి
బయట పడు వైనముల

ఆరునాల్కల అగ్గి బ్రాహ్మడు
కట్టెను సమిధగ కాల్చేయ
పుర్రె పగుల్చూసి
మరుభూమి నుండి మరలి
నా అనుకున్న వారు తరలి
వెళ్ళిపోవటం చూసి

చిద్ర మయ్యే జీవుడి కై
రుద్రు డక్కడే నిలిచెను
జీవాత్మ గుండె పగలనీక
పరమాత్మ నిండుగ నవ్వెను

- rn

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఎందుకోవిడ్+అలేని…ఆశ

                                                              ౧వ అంకం: ఆదినిష్టూరం                              ఎవా నడిరాతిరితిమిరాన రోచులలో...