౧వ అంకం: ఆదినిష్టూరం
ఎవా నడిరాతిరితిమిరాన రోచులలో నిదురెరగని నగరాలు?
ఏవీ ఆ ఖండాంతర రుచుల విందుభోజన సురాపానపసందు వైనాలు?

ఎవా కిక్కిరిసిన కూడళ్లలో అలుపెరుగని జనసాగర కెరటాలు?

ఏవీ ఆ సిటీబస్సుల బుసలలో,మెట్రో ప్రతి’బుస్సు’లలో తోసుకోవడాలు?

అక్కడే దొరికిన చోటులో,చరవాణి ‘చెర’దాసులు,పొత్తాల పురుగులు..
ఎక్కడా ఉరుకులు,పదుల మైళ్ళు,కాళ్ళు,చక్రాలపై పరుగులు?

ఏదీ ఆ రణగొణ అపస్వరోదృత నిరంతర హాహాకార వాహనసరాలు?
ఏదీ ఆ వారనుండీవారకు, నిలువూ, అడ్డం, ఐమూలగా రవాణా సదుపాయాలు?

ఏమా బోసిపోయిన పై-వంతెనలు, వృత్తాలు, నలువరసల రహదారులు!

ఏమా వెండివెలసిపోయిన సినీసాయంత్రాల పలుతెరల సముదాయాలు!
.
.
(సశేషం..)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి