
గౌరవనీయులైన క్రిష్ గారికి...
చలనచిత్ర కళకి తర్వాత మీకు అభిమాని అయిన ఒక ప్రేక్షకుడు వ్రాయునది ....
క్రిష్ గారు...
మా తరం ఏ ఒక్కరు .....
' Oskar Schindler ' పట్టిక లో లేము ....
ఏ పనికి పనికిరారనిపిస్తే తిరిగిరాని లోకానికి విసిరికొట్టబడలేదు
విశ్వ వీణకు తంత్రులై మూ0ర్ఛనలు పోలేదు ..
కాని మాకు ..
ఉన్న కాస్త బుద్ధి కూడా గడ్డి మేసి కంచెలనింకా పెంచుకు పోతున్న మనల్ని చూసి చదువుల తల్లి మొహం మ్లానమైన వైనం..
కళ్ళ ముందుంచారు ...
బతకటానికి తోచని సాధనం...
స్వేచ్చకి నోచని జీవనం ..
స్వేచ్చకి నోచని జీవనం ..
పచ్చని భూమాత నుదుటిపై ఎర్రని రుధిర ధార..
మూర్ఖులాడించే మృచ్చకటిక ..
సౌభ్రాతుత్వానికి శవపేటిక ..
.
.
.
మరలి రాని ప్రియురాలికిచ్చిన మాట నిలిపి అమరుడవుతున్న జవాను హరిబాబు మోము పై ఆ చిక్కని చిరునవ్వు!!!
పొద్దు కునికేలోపు శాశ్వతంగా కునుకేస్తామేమో అని,
రేపటి పొద్దు పొడిచే లోపు బతుకు తెల్లారిపోద్దేమో అని,
క్షణ క్షణం అణగారి ఆరిన ప్రాణాలు రాపాడి రాలిన ఆశా రజను తమ అరచేతుల్లో ఒడిసిపట్టి మారణహోమం మధ్యలో సాటి మనిషిని , మానవత్వపు ఉనికిని కాచేందుకు అశువులు బాసిన జవానులే రుజువు!!!
మా ముందుంచారు ...
గొప్ప చలన చిత్రాలు వస్తాయ్..
కానీ చలనచిత్రాన్ని కళా ఖండంగా నిలబెట్టేవి అరుదు...
కృతజ్ఞతలు,
ఓ ప్రేక్షకుడు,
-ఆర్యన్ హరీష్ (లక్ష్మి నరసయ్య )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి