
https://www.youtube.com/watch?v=CPMQdBmX2n4
This is a mere transcreation of the Janu(Trisha)’s very words in this poetic scene from the movie 96, an epitome of undestined love on celluloid, that has been haunting me ever since I watched.
___-*-___
ఆ తరువాత ఏమైందంటే,
నా కలలలో అయినా జరుగుతుందా అనుకున్నది,
అదే ఈడేరినది,
వచ్చాడు నా రామచంద్రుడు నాకోసం,
ఒక గడియలో మార్చాడు నాలోకం,
తన పేరు వినగ ఓ పెను వణుకున నే తూలి పడబోయాను,
వేలైనా కదపలేకున్నా ఒక్కుదుటున పడవలా ఉరికాను,
{KaathaleKaathale song in the background..
🎼
ఆ...
కొంచెం చిలిపి గా
ఆ స్వర్గాన సేదతీర్చె
ఆదిస్వరాలై
పంచ వర్ణానుభూతి
యద అంచుల పొంగెనే
కనులనిండా ప్రేమ కామెర్లే
🎼
...}
మూడు శిశిరాల మునుపు నేనెరిగిన బాలుడి పసిమి లేమిన,
మోమున మగసిరుల మిసిమిన, సింగపు కూన లా నా ముంగిట కేగిన
నాకై , ఈ జానుకై వచ్చి నిలిచిన
ఈతని,
ఎట్ట ఎదుట కనపడినపుడీ నా రాముని
పట్టుకుని కొన్ని ప్రశ్నలని, చొక్కా పట్టుకుని,
బట్టీ పట్టిన వాటినన్నీ నిగ్గదీసి అడగబోతిని
కానీ-
{KaathaleKaathale
🎼
..
..
"రామ నీ ప్రేమనై
తుది సహచరిగా
సాగనా తోడుగా
పోదాం రావా
రామ నీప్రేమలో
కడదాకా నేనుండి
పోదునా ప్రాణమై... నీ"
🎼
}
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి