13, జులై 2020, సోమవారం

జయహో జవాన్

Image for post

పోరు నష్టం ఊహ తెలియక..
యుద్దమంటే బూడిదే అని ఎరుగక
బద్దకంగా వొళ్ళు విరిచి
మొరలెత్తి ఊల వేసే ఊర కుక్కలు...
అర్ధరాత్రి తిన్నదరగక
కన్నవారిని, తొరగా తొంగోమ్మన్న బామ్మని,
మెల్లగా కన్ను కొరికిన నిదురకొదిలి,
అందరూ పడుకున్నాక,ఇహ పరవాలేదనుకున్నాక,
చుట్టూ పాముకుని,చీకటిలో పాములాగా చుట్టుకుని
చరవాణి చేతబట్టి, దాని తాకే
తెరని తెగ నాకేస్తున్న
అంతర్జాల మార్జాలాలు..
కళ్లు మూసుకుని మియావ్ మియావని ఆవులిస్తూ.. పిల్లి కూతలు,
పన్లు మానుకుని కావు కావు మని,
అసలు మెదడును చలువ పెట్టెలో మడతపెట్టి,
కొసరు తిక్కతో కాకి గోలగా పిల్ల కూతలు.

నింగి నుండి తోకచుక్క లా నెలదిగి

మనింట్లోని వాడొకడు పక్కడేశం లో పట్టుబడితే

మన దేశపు గుట్టులేవీ విప్పనంటూ పట్టుబడితే

నిజాలను నోటమింగి నిలిచిన ఆ గుండె నిబ్బరం

రుధిర గందమలదిన ఆ ధీర అరుణారుణ వదనమొక అబ్బురం,

వయసుడిగిన వారితో పోటీగా వరసలో నిలబడి
ప్రభుత్వం జాలిగా విదిల్చిన చిల్లరేరుకుని
రోడ్డున పడి తిరిగి,చర వాణి లో నెట్ కార్డులేసుకునే
నీకేం తెలుసు రా? నింపాదిగా కూర్చున్న
నీకేం తెలుసు రా? నిజసంపాదన లేనొడా..

మన్నించవోయి ఓ సిపాయి
మమ్ములను, ఈ జులాయి తమ్ములను
క్షమించవోయి వాయు సేనాని
ఈ మెదడెదగని చెల్లెమ్మలను
సెలవులు రద్దయి, ఇంటికి బయలుదేరినా
దారి మధ్యలోనే మళ్లీ సరిహద్దుకు తిరుగు పయనమైన
ఓ నావసైనికుడా
దేశాన్ని కాపాడుకోడానికి దేనికీ వెనుకాడని
నా సోదరుడా

-rn

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఎందుకోవిడ్+అలేని…ఆశ

                                                              ౧వ అంకం: ఆదినిష్టూరం                              ఎవా నడిరాతిరితిమిరాన రోచులలో...