12, జులై 2020, ఆదివారం

అగ్ని..వాయువు..









అగ్ని..వాయువు..


Image for post

ప్రతిరోజు ఒకేలాగా, యధావిధిగ
అదేవిటో తెలీనోక హడావిడిన,
అసలు పరుగంటూ మొదలెట్టిన కారణాన్ని
ఓ మాటైనా అవలోకనం చేశావా?
మరి ఏకబిగిన చేరుకున్న దూరాన్ని
ఓ సారైనా వెనుదిరిగి చూసావా?
ఇపుడైనా దిశను మార్చి నెమ్మదిగా సాగలేవా ?
అరె
మన 'దయానిధి' చీకటి సమస్యేమిటో చదివావా ?
అరెరె
మన 'మహాకవి' ఖడ్గసృష్టి దేనికో అడిగావా ?

అలుపెరగని పయనంలో, మలుపులలో, గమనం లో
జ్ఞాపకాలను తడిమావా ?
ఆ తెరచిన పుస్తకాలను ఆపేసిన చోట నుండి
ఆసాంతం చదివావా?
పేజీలను మనసారా నిమిరావా ?
మజిలీలను నేమారైనా వేసావా?

గతాన్ని గాలికి విడిచి, భవిష్యత్తు బెంగను మరచి,
వర్తమానం విమానమెక్కి, కాలాన్ని ఆరోహిస్తే,
ఆడుతు పాడుతూ, ఆస్వాదిస్తే,
అనుభవాలు ఎదురౌతాయి , గుర్తుగా మిగిలిపోతాయి

అపుడపుడూ మనసెరిగిన మిత్రుడితో
ఆటవిడుపు లాంటి ఓ విహార యాత్రలో :


బెజవాడలో దిగానో లేదో బద్దకంగా బజ్జున్న బండి తీసాను..
లెమ్మన్ టీ తాగి నే సేదతీరుతుంటే
లే లెమ్మంటూ తరిమితే నడిచినట్టే పరుగు తీసాను

నేను: వాడు :

ఎక్కడికీ? పద పదా
అదే ఎక్కడికీ ? ... ... ... ... ...

ఇక్కడికేనా, పక్కనేనా, చాలా దూరమా?అడిగినా చెప్పలేదంటే ఇహ బలాదూరేగా ...

తాడేపల్లి
 రేవేంద్రపాడు
 దుగ్గిరాల
 చింతలపూడి
 తెనాలి
అరె ఎక్కడికీ ? ... ... ... ... ... 
 పేదరావురు 
 కూచిపూడి
 పెదపూడి
 పెరవలి పాలెం

పచ్చని పల్లెటూళ్ళు , చెరువులు కాలువలు
ఐదు తరాలు చూసిన అమ్మమ్మ
కాసేపు కష్టాలు చెప్పుకున్న చిన్నమ్మ
సాయంకాలం సగ్గుబియ్యం-సేమియా పాయసం
చుక్కలు చూస్తుండగా చన్నీటి స్నానం
పాలూ పొట్లకాయ కూర భోజనం
కమ్మగా పోయిన నిద్ర
పొద్దుటే తేనీటి సేవనం,
కోడికూర-చిల్లుగారి టిఫినూ
ఆనక పొగమంచులోనే ప్రయాణం మొదలు

చావలి
కోతేపారు
భట్టిప్రోలు

మధ్యలో ఒక్క సారె ఆగడం
ఒక కుర్రాణ్ణి కలుపుకుని కొనసాగడం ..

హమ్మయ్య! అయ్యిందా ? అప్పుడేనా ?

సూరేపల్లి
 కొలగాని వారిపాలెం

ఇంటికి తాళం చూసి పొలం వైపెళ్తే
కలం లో తాతయ్య కలుపు తీస్తున్నాడు
కుశలప్రశ్నలయ్యాయి
తాతయ్యకేవో ఖర్చులోచ్చాయి
తిరుగు పయనం లో కొల్లూరు మీదుగా పోవడం
ఆ ఊరిలో ఆ కుర్రాడి అభిమానం
నెయ్యి పప్పు వేసిన పరమాణ్ణం ఫలహారం
చిన్నదే అయినా కుర్రాడిది చూడముచ్చటైన పొదరిల్లు
వాడి పుణ్యాన కొత్త దారిలో మల్లి మా బండి పరవళ్లు

ఈపూరు
 చిలుమూరు
 హనుమపాలెం
 కొల్లిపొర

ఏంటీ? ఉల్లిపొరా? నోరు ముయ్యరా?

చివలూరు
 అత్తోట
 నంది వెలుగు

అబ్బా ఇంకెక్కడా? అదిగో బెజవాడ..

దారిలో పలకరించే కళ్ళు
వారి మరో లోకాలకవి కిటికీలు, వాకిళ్ళు

ఇలా మా ఇరువురికిది ఒకటి రెండు రోజుల వసంత ఋతువు
అదే మేము చేసే నియమాల్లేని పవిత్ర క్రతువు

మేము కలిసినపుడిలా కుదురుతుందో,
లేక ఇలా కుదిరినపుడే మేము కలుస్తామో,
ఏమో ..

ప్రకృతి మాకు సహకరిస్తుందో,
ప్రభందాల్ని మేము అనుకరిస్తామో,
ఏమో ..

కావ్య కల్పనలని అనుభవిస్తున్నామో,
కవన వర్ణనలని అనుభూతిస్తున్నామో,

దేశాంతరాల్లో సుదూర ప్రాంతాల్లో
ఎవరో ఇద్దరు మిత్రులు, ఏవో రెండు ఆత్మలు ఇలాగే విహరిస్తుంటాయేమో..

మనసులుమమేకమయ్యే ఈ మైత్రికి చిరాయువు
వాడు అగ్ని, నేను వాయువు...

గొప్ప గమ్యాలు చేరినా , చేరకపోయినా ..
జీవిత మలి సంధ్యలో
ముదిమి వయసులో పెదిమ విరచక
మునుపటి ఊసులు
మోమున ముసి ముసి హాసములై మిగులుతాయి

-rn

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఎందుకోవిడ్+అలేని…ఆశ

                                                              ౧వ అంకం: ఆదినిష్టూరం                              ఎవా నడిరాతిరితిమిరాన రోచులలో...