13, జులై 2020, సోమవారం

❤'లవ్'❤ ల్యా లు (0.0)

(1)
చెలీ, ఈ కాలాయాపనలు, అసలీ ప్రేలాపలనెలా?
ఓ బాలా,
నీ వీనుల నా ఆలాపన లో,
మరి నా లాలనలో
ఓ లలనా అల నీ
నీలాల కనులలా మూసి,
లోలోన మనసు నలా
ఆలోచనల అలలలోన
ను ఓలలాడ నే లాలి పాడ
ను చాల చాల నా జ్ఞాపకాల
మధుపాల పాయసాల
గ్రోలి, సొమ్మసిలి సొలిపోయిక లేవలేక
లీలగా ఊహల లౌల్యము లో,
ఓ సుఖలోకం లో,

కలల వలలలో, కలవరింపులలో
పులకరింపులలో మరి పొలమారి ఉలికిపడి,
ఇలకు మరలి, మెలకువ కలిగి
ఝల్లున విల్లులా ను ఒళ్ళు విరిచిలా
తుల్లిపడి తొల్లి, నీ లోలుని
ఈ బాలుని మరి వొదిలేసిలా,
ఎడలు బాసేలా, వెడల వలదు.

(2)(-- త్వరలో --)

(3)

నాలోపలి ఆ ఆకలిని
సల సల కాగే, మసలి పోయి కాలే,
సెగల అణలమును, నీ వలువల చలువలతొ,
కను కొలుకుల సలిలముతో
లలాట చెమటలతో, అధరముల హిమములతో
నిట్టూరుపులలో ఆర్పి,
పాల కడలి మధనము
పోలిన, మల్లె పడకల,
జాబిలి జోష్ణల జావలుల,
కౌగిలి గిలిగింతల,
నడుముల నడుమల,
చలి లో, కలివిడి లో,
పలు రకముల
పడు సాము గరిడీల లో,
పట్లు విడుపులు సడల,
వింత సడుల, ఒడలు బడల,
రసానుభూతిన అలసటల
సరళ పవనముల
పలు పరిమళముల
ప్రతి ఫలముల మగతలలో
మెల మెల్లగా నిదురల లో
మరలిన మలి ఝాముల
మధుర స్మృతు ల మాలలు
అసలవెన్ని వేలల్లో కలవో.

(4)(-- త్వరలో --)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఎందుకోవిడ్+అలేని…ఆశ

                                                              ౧వ అంకం: ఆదినిష్టూరం                              ఎవా నడిరాతిరితిమిరాన రోచులలో...