
ఎండ కన్నెరుగని కోమలులని,
వెన్న సోకినా కందె సుకుమారులని..
సొగసుల ప్రోవులని, ఎలనాగు కాంతలని,
ఎంతెంత ఎంతెంతని మన ఇంతులను..
మన సుఖావసారాలకు ముఖారవిందాన్ని,
మన జీవనాధా రాలకి నడత అందాల్ని..
వివిధ గ్రంధులు విరివిగా శ్రవిస్తే చేసే,
విడమరిచి అంగాంగ వీర వర్ణనలు..
జాబిలి తో ఉపమానాల, ఉత్ప్రెక్షల సరాలు,
నిజాలు పరికిస్తే, పాలపుంత లో తారలు,
పౌర కుంటుంబానికి అధారమే వారలు,
సకల మానవులకు జీవన ధారలు..
కానీ వారిపైనెన్ని ఆంక్షలు! స్వేచ్ఛ హరించే కక్ష్యలు!
లక్షల్లో రాహు కేతువు లెందరో గ్రసించే శిక్షలు..
ప్రకృతిస్వరూప మంటూనే వారిపై
వికృత చేష్టలు, విసిరే మంటలు..
కన్నీటిని కాచుకుని, ఈ పురుషాధిక్య కక్ష్యలను దాటుకుని సాగడానికి,
అన్నిటినీ అధిగమించి, స్త్రీ ఆధారిత రోదసి చేరుకుని ఆగడానికి,
అందుకోవాల్సిన వేగాలున్నాయి,
అందుకు వదులు చేస్కొదగిన రాగద్వేషాలున్నాయి,
వదులు కోవాల్సిన బంధాలున్నాయి,
నీకై నువు నిరూపించు కోవాల్సిన పంధాలున్నాయి,
నువు నెరపాల్సిన పంతాలున్నాయి,
నువు చెరపాల్సిన లక్ష్మణ రేఖలు ఇంకా ఉన్నాయి,
నువు చేరాల్సిన దూరాలింకా చాలా ఉన్నాయి...
-rn
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి